»Congress Chief Revanth Reddys Satirical Tweet On Telangana Cm Kcr
Revanth Reddy: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్..
కేసీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఆయన ఇచ్చిన హామీలను ఎండగడుతూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
CM Revanth Reddy Asks Officials Provide Better Treatment Injured Persons
Revanth Reddy: ఒకప్పుడు రాజకీయ నేతలు ఎదుటువారిని విమర్షించాలంటే ప్రెస్ మీట్ పెట్టో లేదా ఏదైన మీటింగ్ ఉన్నప్పుడో కామెంట్ చేశావారు. కాని ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా సదుపాయంతో చేతులో ఉన్న ఫోన్‌తో ఒక ట్వీట్ చేస్తే చాలు కావల్సినంత రచ్చ అవుతుంది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి(Telangana CM) కేసీఆర్(KCR) పై కాంగ్రెస్(Congress) రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. దీనిలో భాగంగా అనగనగా ఓ కేసీఆర్ అంటూ మొదలుపెట్టి కథలు కంచికి- కేసీఆర్ ఫాంహౌస్ కి అంటూ ముగించారు. ఈ ట్వీట్‌తో పాటు యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారంటూ ఓ వార్త పత్రిక ప్రచురించిన కథనాన్ని జోడిస్తూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామిలను ఎండగట్టారు. ఎండలో రైతులు గంటల తరబడి నిలుచునేలా చేశాడంటూ కేసీఆర్ పై ఫెయిల్ అయ్యారు. రైతులకు కావాల్సిన ఎరువులను ఉచితంగా ఇస్తానన్న హామీ ఏమైందని నిలదీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతుండడంతో దీనిపై నెటిజనులు తమ అభిప్రాయాలను వెల్లబుచ్చుతున్నారు.
గతంలో సీఎం కేసీఆర్ రైతులను ఉద్దేశించి ఎవరు వరి పంట వేయొద్దని తెలిపాడు. దాని వలన ఫార్మర్స్‌కు పెద్దగా ఉపయోగం లేదని వరికి బదులు పత్తి వేసుకోండి అని సలహా ఇచ్చారు. దీనిపై రేవంత్ వరి ఏస్తే ఉరితాడే అన్న సీఎం తన ఫామ్ హౌస్‌లో 150 ఎకరాలు వరి వేశాడని, అలాగే రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అని కనీసం 10 గంటలు కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. అలాగే ఎరువులు ఫ్రీ అని చెప్పి రైతులను గంటల తరబడి లైన్లో నిలబెట్టారని ఎద్దేవా చేసేలా ట్వీట్ చేశారు. ఇక చివరి లైన్లో ఇచ్చని హామీలను నెరవేర్చలేదనే అర్థం వచ్చేలా కథ కంచికి కేసీఆర్ ఫామ్ హౌస్‌కి అని రాసుకొచ్చారు.
🔥అనగనగా ఒక కేసీఆర్… వరి వేస్తే ఉరన్నాడు… ఆయనే 150 ఎకరాలల్లో వేశాడు.
🔥24 గంటల కరెంట్ అన్నాడు… లాగ్ బుక్ చూస్తే పట్టుమని పది గంటలు లేదు.
🔥రైతులకు ఎరువులు ఫ్రీ అన్నాడు… గంటల తరబడి క్యూల నిలబెట్టాడు.