సత్యసాయి: జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు నిఘా పెట్టారు. పుట్టపర్తి రూరల్ పరిధిలోని నిడిమామిడి, కొట్లపల్లి అటవీ ప్రాంతాల్లో ఆదివారం డ్రోన్ల ద్వారా గాలింపు చేపట్టారు. ఆధునిక సాంకేతికతను వాడుతూ అనుమానాస్పద వ్యక్తుల సంచారం, అక్రమ కార్యకలాపాలను రికార్డు చేశారు. ప్రజలు అనుమానితుల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని కోరారు.