మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో మళ్లీ తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. వరసగా ఫెయిల్యూర్స్ ఎదురౌతున్నా.. అవేమి పట్టించుకోకుండా.. హిట్ కొట్టేందుకు ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే… ఇటీవల ఆయన తన కొత్త సినిమాలోని ఓ డైలాగ్ ని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో రాజకీయాల గురించి టాపిక్ ఉండటంతో… అది కాస్త వైరల్ గా మారింది. అయితే… ఆ ట్వీట్ ఎఫెక్ట్ అందరికన్నా… కాంగ్రెస్ పైనే ఎక్కువగా పడింది. వెంటనే చిరంజీవి ఇంకా మాపార్టీలోనే ఉన్నాడు.. ఇదిగో ఐడీ కార్డు అంటూ షేర్ చేసింది.
పీసీసీసీ డెలిగేట్ గా మెగాస్టార్ చిరంజీవిని కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. 2027 వరకు ఏపీ నుంచి డెలిగేట్ గా చెల్లుబాటు అయ్యే విధంగా చిరుకి కొత్త ఐడీ కార్డు జారీ చేసింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న మధుసూదన్ మిస్త్రీ సంతకం కూడా ఐడీ కార్డ్ మీద ఉంది.
త్వరలో జరిగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా ఈ ఐడీ కార్డ్ జారీ చేసినట్టు తెలుస్తోంది. గతంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు చిరంజీవి. ఆ క్రమంలో కేంద్ర మంత్రిగా కూడా చిరు పని చేశారు. షెడ్యూల్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నికకు రేపు నోటిఫికేషన్ వెలువడనుంది. ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవిని కాంగ్రెస్ తమ పార్టీ వ్యక్తిగానే గుర్తిస్తూ కొత్త ఐడీ కార్డు జారీ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.