chicken price reduce:నాన్ వెజ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. చికెన్ (chicken) ధర భారీగా తగ్గింది. మొన్నటి వరకు కేజీ చికెన్ రూ. 250 నుంచి రూ.300 వరకు ఉంది. ఇప్పుడు అదీ కిలో రూ.160కి చేరింది. దీంతో చికెన్ (chicken) అంటే ఇష్టపడేవారు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
chicken price reduce:నాన్ వెజ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. చికెన్ (chicken) ధర భారీగా తగ్గింది. మొన్నటి వరకు కేజీ చికెన్ రూ. 250 నుంచి రూ.300 వరకు ఉంది. ఇప్పుడు అదీ కిలో రూ.160కి చేరింది. దీంతో చికెన్ (chicken) అంటే ఇష్టపడేవారు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. కొద్దీ రోజుల తర్వాత ధర పెరుగుతుందని వ్యాపారులు అంటున్నారు. వేసవి ప్రారంభానికి ముందు ఇలానే ఉంటుందని వారు చెబుతున్నారు. ఉత్పత్తి పెరగడం, డిమాండ్ తగ్గడం వల్లే ధర తగ్గిందని అంటున్నారు. సమ్మర్ (summer) సీజన్లో మెల్లి మెల్లిగా ధర పెరుగుతుందని తెలిపారు. సమ్మర్లో అయితే వేడికి కోళ్లు తాళలేక చనిపోతుంటాయి. దీంతో చికెన్ ధర రూ.300 వరకు చేరినా ఆశ్చర్యపోవనవసరం లేదు.
అప్పుడప్పుడు ప్లూ.. ఇతర వ్యాధులు సోకిన సమయంలో కూడా చికెన్ ధర తగ్గుతుంది. దాంతో చికెన్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు సండే (sunday) అని లేదు.. ఎప్పుడు తినాలని అనిపిస్తే.. అప్పుడే లాగించేస్తున్నారు. కొందరు ఉపవాసాలు చేస్తున్నారు. మరికొందరికీ అలాంటివీ ఏమీ లేవు. వారికి రోజు పండగే.. ముఖ్యంగా ధర తగ్గిన సమయంలో అయితే చికెన్‌తో జాతర చేసేస్తారు.
ముక్క లేనిదే ముద్దా దిగదు అనే వారు కొందరు ఉంటారు. అలాంటి వారికి చికెన్ ధర తగ్గడం అనేది నిజంగా గుడ్ న్యూస్. నాటు కోడి (country chicken) చికెన్ ధర కూడా పడిపోయింది. రూ.500 పలికిన నాటు కోడి.. ప్రస్తుతం 350 నుంచి 400 వరకు పలుకుతోంది. నాటు కోళ్ల ఉత్పత్తి భారీగా పెరుగడం వల్ల ధరలు తగ్గుతున్నాయి. ఖమ్మం (kammam) నుంచి హైదరాబాద్‌కు (hyderabad) నాటు కోళ్లు డిమాండ్‌కు మించి వస్తున్నాయని వ్యాపారులు అంటున్నారు. ఫారాల్లో పెంచే కడక్ నాథ్ కోళ్లు కూడా మార్కెట్లోకి అంచనాలకు మించి రావడంతో ధరలు దిగాయిని భావిస్తున్నారు. మెదక్ (medak), కరీంనగర్ (karimnagar) జిల్లాల నుంచి కూడా కోళ్లు రావడం, అమ్మకాలు తగ్గడం వల్ల ధరలు దిగొస్తున్నాయని పౌల్ట్రీ వర్గాలు అంటున్నాయి. దీంతో.. చికెన్ అంటే ఇష్టపడే వారు పండగ చేసుకుంటున్నారు.