Exit Poll: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ముగుస్తాయి. నవంబర్ 7వ తేదీన ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఆ రోజు నుంచి ఎగ్జిట్ పోల్స్‌పై (Exit Poll) ఈసీ నిషేధం విధించింది. ఈ రోజు సాయంత్రం 6.30 గంటల వరకు అమల్లో ఉంటుందని స్పష్టంచేసింది. ఆ తర్వాతే పోల్స్ ప్రకటించాలని సంస్థలు భావించాయి. కానీ ఈసీ అనూహ్య నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుంది. మిగతా చోట్ల సాయంత్రం 5 గంటలకు క్లోజ్ అవుతుంది. పోల్ పూర్తయిన తర్వాత అంటే సాయంత్రం 5.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ (Exit Poll) ఇవ్వొచ్చని స్పష్టంచేసింది. గంట సమయాన్ని ఎన్నికల సంఘం ముందుకు జరిపింది. టైమ్ ఇవ్వకుంటేనే హడావిడి చేసే సంస్థలు.. తమకు అనుకూలంగా టైమ్ రావడంతో ఇప్పటినుంచే ఆ పనిలో ఉన్నాయి.
తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, ఛత్తీస్ గఢ్‌లో పోలింగ్ జరిగింది. ఛత్తీస్ గఢ్ తప్ప మిగతా 4 చోట్ల ఓకే విడతలో పోలింగ్ జరిగింది. ఇక్కడ మావోయిస్టుల ప్రాబల్యం నేపథ్యంలో రెండు విడతల్లో జరిగింది.