Revanth సర్కార్ సంచలన నిర్ణయం.. కేసీఆర్ భద్రత కుదింపు
కేసీఆర్‌కు భద్రతను రేవంత్ సర్కార్ కుదించింది. జెడ్ ప్లస్ క్యాటగిరీ నుంచి వై క్యాటగిరీకి మార్చింది. మాజీ మంత్రులుగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేలు అయిన వారికి 2 ప్లస్ 2 గన్ మెన్లను కేటాయించింది. కార్పొరేషన్ చైర్మన్లకు పూర్తిగా భద్రతను తొలగించింది.
KCR Security Reduce: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth) కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖుల భద్రతపై సమీక్ష చేశారు. అవసరం లేని వారి భద్రతను కుదించారు. అందులో మాజీ సీఎం కేసీఆర్ (KCR) కూడా ఉన్నారు. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్‌కు జెడ్ క్యాటగిరీ భద్రత ఉంది. ఇప్పుడు ఆ ప్రొటెక్షన్‌ను రేవంత్ సర్కార్ తగ్గించింది.
కేసీఆర్‌కు జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత ఉంది. ఇప్పుడు దానిని వై క్యాటగిరీకి మార్చారు. దీంతో 4 ప్లస్ 4 గన్ మెన్లు మాత్రమే ఉంటారు. కేసీఆర్ ఇంటి వద్ద సెంట్రీ ఉంటుంది. కాన్వాయ్‌కు ఒక వాహనం ఏర్పాటు చేస్తారు. కేసీఆర్ మొన్నటి వరకు సీఎంగా పనిచేశారు. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా కూడా విధులు నిర్వర్తించారు. ఉద్యమ సమయం నుంచే ఆయనకు జెడ్ క్యాటగిరీ ప్రొటెక్షన్ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో భద్రతను కుదించారు.
మావోయిస్టుల నుంచి గతంలో కేసీఆర్‌కు థ్రెట్ ఉండేది.. సీఎం అయిన తర్వాత అలాంటి ఇన్సిడెంట్స్ ఏమి కనిపించలేదు. అయినప్పటికీ భద్రత తగ్గించడం అనేది కీలకమైన అంశం. దీంతోపాటు మంత్రులుగా పనిచేసి.. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి 2 ప్లస్ 2 భద్రతను కల్పించారు. మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లకు భద్రతను తొలగించారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలలో భద్రత అవసరమైన వారికి, ఏజెన్సీ ఏరియాలో ఉండేవారికి గన్ మెన్లను ఇచ్చే అవకాశం ఉంది. వారి భద్రత గురించి రివ్యూ చేసిన తర్వాత గన్ మెనన్లు ఇవ్వడంపై నిర్ణయం తీసుకుంటారు.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రం ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్‌కు వెళ్లారు. అక్కడ అర్ధరాత్రి బాత్ రూమ్‌లో కాలుజారి పడ్డారు. దీంతో తుంటి ఎముక విరిగింది. వెంటనే సోమాజిగూడలో గల యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడే అబ్జర్వేషన్ చేసి తుంటి మార్పిడి సర్జరీ చేశారు. కోలుకోవడంతో ఈ రోజు డిశ్చార్జ్ చేశారు. కుమారుడు కేటీఆర్ ఉండే నందినగర్‌కు కేసీఆర్ వచ్చారు. పూర్తిగా కోలుకోవడానికి 8 వారాల వరకు పడుతుందని వైద్యులు తెలిపిన సంగతి తెలిసిందే.