»New High Court In Telangana In 100 Days Rajendra Nagar Hyderabad
Telangana New High Court: 100 రోజుల్లో తెలంగాణలో కొత్త హైకోర్టు!
తెలంగాణలో మరికొన్ని రోజుల్లో కొత్త హైకోర్టు భవనం ఏర్పాటు కానుంది. అది కూడా మాములుగా కాదు. 100 ఏకరాల్లో నిర్మించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
New High Court in Telangana in 100 days rajendra nagar hyderabad
తెలంగాణలో మరో కొత్త కట్టడం నిర్మాణం కానుంది. ఇప్పటికే రాష్ట్రంలో పాత అసెంబ్లీ భవనం తొలగించి కొత్తది నిర్మించగా..ఇదే కొవలో ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న హైకోర్టు భవనానికి బదులుగా కూడా కొత్తది నిర్మించనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి రాజేంద్రనగర్లో 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు భవనం నిర్మించనున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదేతో సమావేశమైన నేపథ్యంలో పేర్కొన్నారు.
ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ తోపాటు ఇతర ఉన్నాతాధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలో రాష్ట్రంలోని న్యాయ స్థానాల స్థితిగతులు, వసతుల అంశాలపై కూడా చర్చించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ప్రధానంగా హైకోర్టు భవనం పరిస్థితి గురించి ప్రధాన న్యాయమూర్తి సీఎం రేవంత్ కు చెప్పగా..సీఎం వెంటనే స్పందించి ఎక్కడ వంద ఎకరాల కంటే ఎక్కువ ప్రభుత్వ స్థలం ఉంటుందో అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు వచ్చే జనవరిలో శంకుస్థాపన చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని రేవంత్ అన్నారు.