ADB: జాతీయ సేవా పథకం శిబిరాల ద్వారా ప్రజలకు సేవలు అందించాలని ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ అన్నారు. బుధవారం ఉట్నూర్‌లోని ఐటీడీఎ కార్యాలయంలో ఉప సంచాలకులు జాదవ్ అంబాజీ, జాతీయ సేవా పథక నిర్వాహకురాలు కొరిమి ప్రత్యూషలతో కలిసి టీ షర్టులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సంబధిత అధికారులు ఉన్నారు.