KNR: వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్‌లో పలు దోపిడీలకు పాల్పడి 3.4 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లిన నిందితులను నిన్న పోలీసులు అరెస్టు చేశారు. జమ్మికుంటకు చెందిన చల్లా శ్రీకాంత్, హసన్‌పర్తి మండలం భీమారం గ్రామానికి చెందిన గాజే సాయిచంద్, మిర్యాల భాస్కర్ కలిసి పలుచోట్ల చోరీలకు పాల్పడి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు వీణవంక SI తిరుపతి తెలిపారు.