SRCL: ఈనెల 19వ తేదీ నిర్వహించనున్న హిందూ సమ్మేళన కార్యక్రమం విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ కోరారు. ఈ మేరకు కార్యక్రమ కరపత్రాన్ని సోమవారం వేములవాడలో ఆవిష్కరించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హిందువులు కదిలి రావాలని ఆయన కోరారు.