HYD: ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో మిడ్ వైఫరీ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. బోయగూడలోని మిడ్ వైఫరీ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో సేఫ్ మదర్ హుడ్ డే వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ.. సహజ ప్రసవాలను ప్రోత్సహించేందుకు మిడ్ వైఫరీ సేవలను రాష్ట్రంలో బలోపేతం చేస్తున్నామని అన్నారు.