BDK: మాజీ సీఎం చంద్రశేఖరరావు క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడిని నిరసిస్తూ ఆదివారం ఇల్లందులో బీఆర్ఎస్ నాయకులు మాజీ గ్రంథాలయ ఛైర్మన్ దిండిగాక రాజేందర్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం జగదాంబ సెంటర్లో ప్రదర్శన చేపట్టారు. ప్రతిపక్ష నాయకుడికి ప్రభుత్వం కేటాయించిన కార్యాలయంపై దాడి చేయడం దుర్మార్గమన్నారు.