WGL: కాశీబుగ్గ SR నగర్లో దారుణం జరిగింది. ఆటో డ్రైవర్ అబ్బరబోయిన రాజు తన భార్య అనిత (40)కు నిన్న రాత్రి గొడవ జరిగింది. ఈ గొడవలో రాజు, తన భార్య తలపై రోకలిబండతో బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలైన ఆమెను కుటుంబ సభ్యులు MGM ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.