BHNG: భువనగిరి మున్సిపాలిటీ 3వ వార్డు కమాన్ నుంచి గ్రామంలోకి వచ్చే ప్రధాన సర్వీస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన వీధి దీపాలను మున్సిపల్ ఛైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ పాల్త్య వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు పల్లెర్ల యాదగిరి, ఎండి ఫసియోద్దీన్, స్థానికులు మున్సిపల్ ఛైర్ పర్సన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.