NZB: భీమగల్ పట్టణంలో NSUI ఆధ్వర్యంలో శనివారం సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. NSUI జిల్లా ఉపాధ్యక్షుడు రెహమాన్ పాల్గొని ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహిళా విద్య కోసం ఆమె చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. విద్యార్థులు ఆమె ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.