ADB: రేపటి నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షల్లో విద్యార్థినులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని సర్పంచ్ మెస్రం చందు అన్నారు. ఆయన శుక్రవారం నార్నూర్ మండలంలోని జాండ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. జీవితానికి ఓ మార్గం చూపేలా పదో తరగతి పరీక్షలు ఉంటాయని, విద్యార్థులు గమనించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో HM వందన, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.