NGKL: తెలంగాణ భవన, నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఆధ్వర్యంలో నమోదిత కార్మికులకు ‘రీకగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్’ విధానంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. మేసన్, బార్ బెండింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వంటి విభాగాల్లో నైపుణ్యాలు పెంపొందించడం ఈ కార్యక్రమ ఉద్దేశం. 18 నుంచి 30 ఏళ్ల వయస్సు ఉండి, బోర్డులో పేరు నమోదు చేసుకున్న కార్మికులు ఈ శిక్షణకు అర్హులని జిల్లా అధికారులు తెలిపారు.