WNP: భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలంటూ ఈ నెల 25న చేపట్టబోయే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీయూసీఐ జిల్లా కార్యదర్శి సి.రాజు పిలుపునిచ్చారు. శుక్రవారం మదనాపురం మండల కేంద్రంలో చలో హైదరాబాద్కు సంబంధించిన గోడపత్రికలను కార్మికులతో కలిసి విడుదల చేశారు. కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.