SDPT: టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్లో వివిధ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని సిద్దిపేట జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి హమీద్ తెలిపారు. అభ్యర్థులు హల్ టికెట్స్ని tsstudycircle.co.in నుంచి డౌన్లోడ్ చేయాలని తెలిపారు. మార్చి 1న స్థానిక ప్రతిభ డిగ్రీ కళాశాలలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష ఉంటుందన్నారు.