SRD: పటాన్చెరులో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో భాగంగా డా.బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 200 మంది పాల్గొన్న ఈ సభలో ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా ప్రతిజ్ఞ చేయించారు. హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని అధికారులు సూచించారు.