జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు “అరైవ్-అలైవ్” కార్యక్రమం ప్రారంభమైంది. ఏప్రిల్ 13-18 వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా ఓల్డ్ బస్ స్టాండ్ వద్ద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు. SP మాట్లాడుతూ.. అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్, మొబైల్ వినియోగమే ప్రమాదాలకు కారణమని తెలిపారు.