SRCL: అగ్నిమాపక వారోత్సవాలు పోస్టర్లను జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఎస్పీ మహేష్ బీ గీతే ఆవిష్కరించారు. అగ్నిమాపక దళ సిబ్బంది స్మారకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అగ్నిమాపక దళ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రచారం చేస్తూ ప్రజలకు వివరించారు.