JGL: ఆస్ట్రేలియా గడ్డ మీద సెంచరీ చేసిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి ధర్మపురి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని విజయాలు సాధిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.