NZB: మహిళ రిజర్వేషన్‌కు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని జిల్లా DCC అధ్యక్షుడు నగేష్ రెడ్డి అన్నారు. సోమవారం DCC కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ పేరుతో బీజేపీ చేస్తున్న నియోజకవర్గాల పునర్విభజనకు మాత్రమే వ్యతిరేకమని అన్నారు. బీజేపీకి మహిళలపై చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం ఉన్న 543 పార్లమెంటు స్థానాలలో మహిళ రిజర్వేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు