NGKL: జిల్లాలో ఈ సీజన్లో ఇప్పటివరకు 8,61,333 బస్తాల యూరియా పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యాప్ ద్వారా 3,20,626 బస్తాల యూరియా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. 62,942 మంది రైతులు యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేశారని పేర్కొన్నారు.