కామారెడ్డి: బీర్కూర్ మండలం వీరాపూర్ గ్రామ పంచాయతీని డివిజన్ పంచాయతీ అధికారి సందర్శించారు. గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కంపోస్ట్ షెడ్‌ను సందర్శించి, ఎరువు తయారీ ప్రక్రియపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రామ పంచాయతీ రికార్డులను తనిఖీ చేసిన ఆయన, విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని కార్యదర్శిని ఆదేశించారు.