ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను కలెక్టర్ హరిత బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటశాల, డార్మెంటరీలను పరిశీలించి విద్యార్థుల హాజరు, స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు.