KMM: మధిర ప్రభుత్వ ఆసుపత్రిని ఆదివారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాజువాలిటీ, డయాలసిస్ సెంటర్ లేబర్ రూమ్ ఎమర్జెన్సీ వార్డులను పరిశీలించి రోగులతో మాట్లాడారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్యూటీకి హాజరు కాని వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.