NLG: నల్గొండ జిల్లాలోని ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి డిమాండ్ చేశారు. శుక్రవారం ఐద్వా నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ బస్టాండ్లో సంతకాల సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండ అనురాధ, జిట్ట సరోజ, తదితరులు పాల్గొన్నారు.