KNR: తెల్లవారుజామున కురిసిన వడగండ్ల వానకు వీర్నపల్లి మండల వ్యాప్తంగా సుమారు 400 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు మండల వ్యవసాయ అధికారి జయ తెలిపారు. ఎర్రగడ్డ తండా, రంగంపేట, గర్జనపల్లి, శాంతినగర్ గ్రామాలలో అకాల వర్షానికి నష్టపోయిన పంట పొలాలను వ్యవసాయ అధికారులు సందర్శించారు. దెబ్బతిన్న పంట పొలాలు, రైతుల వివరాలను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు ఏవో తెలిపారు.