MNCL: చెన్నూర్ పట్టణంలో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. పాత బస్టాండ్ నుంచి పెద్ద చెరువు వరకు మార్కింగ్ ప్రకారం 5 రోజుల్లోగా షాపులు ఖాళీ చేయాలని ఆదేశించారు. గడువు ముగిసిన వెంటనే వెడల్పు పనులు ప్రారంభిస్తామని, పట్టణ అభివృద్ధికి అందరు సహకరించాలన్నారు.