ASF: జిల్లా కేంద్రంలోని ZP బాలుర పాఠశాలను మంగళవారం కలెక్టర్ వెంకటేష్ దోత్రే సందర్శించారు. విద్యార్థుల హాజరు పట్టిక,తరగతి గదులు,కిచెన్ షెడ్,మరుగుదొడ్లు పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు ఏవైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పాఠ్యంశంలోని పలు ప్రశ్నలు అడిగి విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టారు. ప్రభుత్వ సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.