KNR: గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో శ్రీకృష్ణ యువజన సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలిలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. మట్టికుండలలో చల్లటి తాగునీటిని అందిస్తూ బాటసారులు, వాహనదారుల దాహార్తిని తీర్చుతున్నారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు యువకులు తెలిపారు.