HNK: కాజీపేట మండలం భట్టుపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో మంగళవారం విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో ఇద్దరు అధ్యాపకులు గాయపడ్డారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం సాయంత్రం మళ్లీ గొడవగా మారగా, అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధ్యాపకుల్లో ఒకరికి తలకు గాయం, మరొకరికి చేయి విరిగింది. ఈ ఘటనపై మడికొండ ఎస్సై రాజ్‌కుమార్ విచారణ చేపట్టారు.