NZB: ధర్పల్లి స్థానికశాఖ గ్రంథాలయ నూతన లైబ్రేరియన్‌గా టీ. వాణి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన గ్రంథపాలకుడు కిషన్ కామారెడ్డికి బదిలీ కాగా, డిచ్పల్లి లైబ్రరీలో ఉన్న వాణి బదిలీపై ధర్పల్లికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె కిషన్ నుంచి బాధ్యతలను స్వీకరించారు. గ్రంథాలయంలో పాఠకుల కోసం మరిన్ని నూతన పుస్తకాలు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు.