KNR: మేరా యువభారత్, ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల ఆధ్వర్యంలో షాహిద్ దివస్ సందర్భంగా కరీంనగర్లో పాదయాత్ర నిర్వహించారు. జిల్లా యూత్ కో-ఆర్డినేటర్ వెంకట రాంబాబు మాట్లాడుతూ.. అమరవీరుల దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. దేశం కోసం చిన్న వయసులోనే ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ వంటి వీరుల త్యాగాలు నేటి యువతకు ప్రేరణగా నిలవాలని అన్నారు.