KCR Coverts: తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ప్రజలను ఆకట్టుపనిలో ప్రధాన పార్టీ నేతలు ఉన్నారు. అదే సమయంలో ఆరోపణలు- ప్రత్యారోపణల వేగం పెంచాయి. బీజేపీ నేత నందీశ్వర్ గౌడ్ (Nandeshwar Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ గురించి.. కోవర్టులు ఉన్నారని కామెంట్ చేసి ప్రకంపనలు రేపారు.
బీజేపీలో సీఎం కేసీఆర్ (cm kcr) కోవర్టులు (Coverts) ఉన్నారని నందీశ్వర్ గౌడ్ (Nandeshwar Goud) అంటున్నారు. అందుకు సంబంధించి పేర్లతో హై కమాండ్‌కు వివరించానని చెబుతున్నారు. తీరు మార్చుకోవాలని మీడియ ముఖంగా చెబుతున్నారు. లేదంటే మీడియా (media) ముందుకు వచ్చి పేర్లను బయటపెడతానని స్పష్టంచేశారు. అంతేకాదు మరో 15 రోజుల్లో మీరు సంచలన వార్త వింటారని హింట్ ఇచ్చారు.
బీజేపీ నేత నందీశ్వర్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీలో కేసీఆర్ కోవర్టులు ఉన్న మాట నిజమే. పేర్లతో సహా అధిష్టానానికి చెప్పాను. తీరు మార్చుకోకపోతే మీడియా సాక్షిగా పేర్లు బైట పెడతాను. 15 రోజుల్లో సంచలన వార్త వింటారు.
ఇటీవల మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు (jupally krishna rao).. జూన్ 15వ తేదీ లోపు తాను, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (ponguleti srinivas reddy) ఏ పార్టీలో చేరేది.. ఎవరితో కలిసి పనిచేసే అంశాన్ని వివరిస్తామని పేర్కొన్నారు. తమతో ఈటల రాజేందర్ (etela rajender) కూడా కలిసి రావాలని కోరారు. ఈ క్రమంలో నందీశ్వర్ గౌడ్ (Nandeshwar Goud) చేసిన 15 రోజుల్లో సంచలన వార్త ఏంటీ అనే చర్చ మొదలైంది.
అంతేకాదు తనది ఏ వర్గం కాదని నందీశ్వర్ గౌడ్ అంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీమ్ కాదు.. అలాగే ఈటల రాజేందర్ వర్గం కూడా కాదని చెప్పారు. ఏ వర్గం కాదంటూనే బాంబ్ పేల్చారు. కోవర్టులు అని.. అలాగే సంలచన వార్త అని హీట్ పెంచారు. ఆ విషయం మరికొద్దీరోజుల్లో తెలియనుంది.