Telangana versity: తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) వీసీ వర్సెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) మధ్య గొడవ సద్దుమణగలేదు. వర్సిటీలో అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో విశ్వ విద్యాలయంలో (Telangana University) ఫైళ్లను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, అకౌంట్స్ సెక్షన్, ఏవో సెక్షన్, ఎస్టాబ్లిష్ మెంట్ సెక్షన్లో ఈ రోజు సోదాలు చేశారు.
అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలు జరిగాయని ఇప్పటికే ఈసీ చర్యలకు ఉపక్రమించింది. వైస్ చాన్స్‌లర్ (VC) రవీందర్ గుప్తా (ravinder gupta) అక్రమాలకు పాల్పడ్డారని, రిజిస్ట్రార్‌ను మారుస్తామని ఈసీ (ec) ప్రకటించింది. అందుకు వ్యతిరేంకగా కొత్త రిజిస్ట్రార్‌ను నియమిస్తూ వీసీ డిసిషన్ తీసుకున్నారు. దీంతో వర్సిటీలో పాలన గాడి తప్పింది. ఈసీ సభ్యులకు వీసీ మధ్య ఉప్పు- నిప్పుగా పరిస్థితి మారింది.
హైదరాబాద్ (hyderabad) రుసా భవన్లో ఈ నెల 3వ తేదీన పాలకమండలి సమావేశం జరగగా.. గత పాలకమండలి తీసుకున్న నిర్ణయాలపై చర్చించారు. వీసీ (VC) చేసిన నియామకాలు, దినసరి కూలీలకు ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) అనుమతి లేకుండా నగదును బ్యాంకు నుంచి తీశారు. రూ.28 లక్షల నగదు చెల్లించారు. ఇతరుల పేర్లతో బ్యాంకుల నుంచి డబ్బు డ్రా చేశారు. ఆ తర్వాత జరిగిన సమావేశానికి వీసీ రవీందర్ గుప్తా (Ravinder Gupta) హాజరుకాలేదు. అవినీతి ఆరోపణలపై కమిటీ వేసి, చర్యలు తీసుకోవాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఆ మేరకు ఈ రోజు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
మరోవైపు వీసీ రవీందర్ గుప్తాపై (Ravinder Gupta) శాఖాపరంగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ముందడుగు వేసిందని విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు.