Farmer discovers Rs 2 crore worth diamond in field
Kurnool: ఖరీఫ్ సీజన్ వచ్చిందంటే చాలు రాయలసీమ.. ముఖ్యంగా కర్నూలు (Kurnool) జిల్లాల్లో వజ్రాల కోసం వేట జరుగుతుంది. వజ్రకరూర్..ఇతర చోట్ల అన్వేషణ జరుగుతుంది. కొందరు రైతులకు (farmers) వజ్రం దొరికి వారి ఇంట పంట పండిస్తోంది. ఇటీవల తుగ్గలి మండలం బసనేపల్లికి చెందిన రైతుకు (farmers) ఓ వజ్రం దొరికింది. దానిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. రూ.2 కోట్లకు గుత్తికి (gutti) చెందిన ఓ వ్యాపారి (businessman) దక్కించుకున్నాడు.
ఏటా తొలకరి పలకరింపు సమయంలో రైతులు, ఇతరులు వజ్రాల కోసం వెతుకుతుంటారు. వారిలో కొందరికీ అదృష్టం వరిస్తోంది. అలా కొందరు తమ పనులను మాని, మరీ పొలంలో వెతుకుతుంటారు. బసనేపల్లి రైతుకు వజ్రం దొరికింది. విషయం ఇలా మిగతా వారికి తెలిసింది. ఆ వజ్రం విలువైందని తెలుసుకుని.. దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. వేలం వేయంగా భారీ ధర పెట్టేందుకు గుత్తికి చెందిన వ్యాపారి ఇంట్రెస్ట్ చూపించారు. రూ.2 కోట్లు పెట్టి ఆ వజ్రం దక్కించుకున్నాడు. సీజన్లో ఈ వజ్రం విలువైందని స్థానికులు చెబుతున్నారు. ఈ సారి రూ.2 లక్షలు, రూ.3 లక్షల విలువగల వజ్రాలు దొరికాయని స్థానికులు చెబుతున్నారు. గరిష్టంగా రూ.20 లక్షల విలువజేసే వజ్రం దొరికిందని తెలిపారు. రూ.2 కోట్ల వజ్రం ఇదేనని.. ఆ రైతు ఇంట సిరులు పండించిందని చెప్పారు.