కార్తీ డిఫరెంట్ జోనర్ ఎంటర్టైనర్లకు పేరుగాంచాడు. అతని చిత్రం జపాన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ సినీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. అయితే జపాన్ మూవీ నిజ జీవిత దొంగ ఆధారంగా రూపొందించబడినట్లు తెలుస్తోంది.
తమిళ హీరో కార్తీ(karthi) నటిస్తున్న కొత్త సినిమా జపాన్(Japan). ఈ మూవీ టీజర్ ఇటీవల విడుదల చేయగా అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. కాగా.. నిజ జీవితంలో ఓ దొంగ కథనే ఈ సినిమాగా రూపొందిస్తున్నారట. మామూలుగానే కార్తీ సాధారణ కథలు ఎంచుకోడు. ఆయనవన్నీ డిఫరెంట్ జోనర్లకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటాయి. ఇప్పుడు ఈ కథ కూడా డిఫరెంట్ గా ఉండటంతోనే ఆయన ఎంచుకున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ సినీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. రాజా మురుగన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 దీపావళి సందర్భంగా గ్రాండ్ రిలీజ్ కోసం రేసులో ఉంది.
సునీల్, నవనీత్, ఆశా సుధీర్, విజయ్ మిల్టన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో అను ఇమాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోందని, ఓ దొంగ బయోపిక్ అని వార్తలు వస్తున్నాయి. తమిళనాడులోని చెన్నైలోని ప్రముఖ లలితా జ్యువెలరీలో తిరువారూర్ ముర్గన్ 13 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, వజ్రాలను దోచుకున్నాడు.
ఈ దోపిడీ 2019లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తమిళనాడు(tamilnadu) పోలీసులు దక్షిణాదిన ఇతర రాష్ట్రాల్లో కూడా దోపిడీలకు పాల్పడిన మురుగన్‌ను అరెస్టు చేయగలిగారు. అయితే, మురుగన్ 2020లో జైలులో ఎయిడ్స్‌తో మరణించాడు. ఇప్పుడు మేకర్స్ తిరువారూర్ మురుగన్‌పై సినిమా తీస్తున్నారు. అయితే, కథలో కొన్ని మార్పులు చేయమని కార్తీ కోరినట్లు తెలుస్తోంది. మురుగన్ ఎందుకు దొంగగా మారాడు. అనేక ప్రతిష్టాత్మకమైన ఔట్లెట్లను ఎలా దోచుకున్నాడు అనే కమర్షియల్ ఎలిమెంట్స్‌ని మేకర్స్ జోడిస్తున్నారు. క్లైమాక్స్ విషయంలో చిత్ర సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిజ జీవితంలో జరిగిన సంఘటనలను చూపించాలని కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు సుఖాంతంతో ముందుకు రావాలని అభిప్రాయపడుతున్నారు.