»Nia Raids 19 Places In Four States And 8 Isis People Arrested
NIA: ఉగ్ర కుట్ర భగ్నం చేసిన NIA..8 మంది ఐసిస్ ఏజెంట్లు అరెస్టు
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోమవారం నాలుగు రాష్ట్రాలు, ఢిల్లీలోని 19 ప్రాంతాల్లో దాడులు నిర్వహించగా, మాడ్యూల్ హెడ్‌తో సహా ఎనిమిది మంది ఐఎస్ఐఎస్ కార్యకర్తలను అరెస్టు చేసినట్లు ఓ అధికారి తెలిపారు.
NIA raids 19 places in four states and 8 isis people arrested
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) సోమవారం నాలుగు రాష్ట్రాల్లోని 19 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో నిషేధిత ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ ఆర్గనైజేషన్ బళ్లారి మాడ్యూల్‌కు చెందిన ఎనిమిది మంది కార్యకర్తలను అరెస్టు చేసింది. వారిలో దాని నాయకుడు మినాజ్ అలియాస్ Md. సులైమాన్, ఉగ్రవాద చర్యలకు నిందితులు చేసిన ఉగ్ర కుట్రలను భగ్నం చేశామని ఏజెన్సీ తెలిపింది. అయితే అరెస్టయిన ఎనిమిది మంది ISIS ఏజెంట్లు నిషిద్ధ సంస్థ అయిన ISIS తీవ్రవాద సంబంధిత చర్యలు కార్యకలాపాలను చురుకుగా ప్రోత్సహించడంలో పాల్గొన్నారు. వారు మినాజ్ నాయకత్వంలో పనిచేస్తున్నారని దర్యాప్తు సంస్థ తెలిపింది.
The National Investigation Agency (#NIA) on Monday carried out searches at over 19 locations in the country in connection with a radicalised jihadi terror group.
Agency sources said that the searches are underway at over 19 locations since early morning.
ఈ దాడుల్లో సల్ఫర్, పొటాషియం నైట్రేట్, బొగ్గు, గన్‌పౌడర్, చక్కెర, ఇథనాల్ వంటి పేలుడు ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. దీంతోపాటు పదునైన ఆయుధాలు, లెక్కల్లో చూపని నగదు, నేరారోపణ పత్రాలతో పాటు స్మార్ట్ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలు అదుపులోకి తీసుకున్నామని NIA వెల్లడించింది. గ్రూప్‌లోని పలువురు సభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఏజెన్సీ సోదాలు ప్రారంభించింది. పలువురు అనుమానిత వ్యక్తులకు సంబంధించిన ప్రాంగణాలపై దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు. NIA బృందాలు కర్ణాటకలోని బళ్లారి, బెంగళూరులో విస్తరించి ఉన్న 19 ప్రదేశాలపై దాడి చేశాయి. మహారాష్ట్రలోని అమరావతి, ముంబై, పూణే, జార్ఖండ్‌లోని జంషెడ్పూర్, బొకారో, న్యూఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో ఈ సోదాలు చేశారు.