రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న ‘ధురంధర్’ చిత్రంపై వివాదం నెలకొంది. ఈ సినిమా విడుదలను ఆపాలని మేజర్ మోహిత్ శర్మ కుటుంబ సభ్యులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి తమ నుంచి గానీ, భారత సైన్యం నుంచి గానీ మేకర్స్ ఎలాంటి అనుమతి తీసుకోలేదని వారు కోర్టుకు తెలియజేశారు. దీంతో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.