NLG: ఈవ్ టీజింగ్ వంటి ఆకతాయిల వేధింపుల పట్ల విద్యార్థుల్లో పూర్తిస్థాయి అవగాహన పెంపొందించాలని నల్లగొండ షీ టీమ్ ఏఎస్సై రామిరెడ్డి అన్నారు. నల్లగొండ షీ టీమ్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ ఆదేశాల మేరకు ఇవాళ నల్లగొండ పట్టణంలోని పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు అవగాహన కల్పించారు.