W.G: నరసాపురం మండలం సీతారామపురంలో శనివారం నియోజకవర్గ స్థాయి మాలల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం సీతారామపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ముఖ్యఅతిథిగా హాజరవుతారని, పలువురు రాజకీయ ప్రముఖులు, ఐపీఎస్ అధికారులు పాల్గొంటారని వెల్లడించారు.