GDWL: పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థుల నుంచి డిక్లరేషన్ తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. శుక్రవారం ఆయన శెట్టి ఆత్మకూరు, సంగాల, గోనుపాడు సహా పలు గ్రామ పంచాయతీల్లోని నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. అభ్యర్థుల వివరాలను ఓటరు జాబితాతో సరిచూసుకోవాలని, నిర్దేశించిన డిపాజిట్ మాత్రమే స్వీకరించి రసీదు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.