»Sanjays Cart Is A Shock To Etala Who Joined Hands With The Disaffected Bjp
Etala Rajender : బీజేపీ అసంతృప్తులతో చేతులు కలిపిన ఈటల …బండి సంజయ్ కి షాక్..
ఇద్దరూ ఒకే పార్టీలో వున్నారు. ఇద్దరివీ కీలక బాధ్యతలే.. ఇతర నాయకులకు మార్గదర్శకంగా వుండాల్సిన ఆ నేతలిద్దరూ తమ మధ్యనున్న విభేదాలను అనుకోకుండానే బయట పెట్టుకుంటున్నారు
తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) కి వ్యతిరేకంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) పావులు కదుపుతున్నారు. బీజేపీ పార్టీ అధ్యక్షుడు అయిన తరువాత బండి సంజయ్ ఆధిపత్యం పెరిగి తమను కలుపుకుపోవట్లేదని కరీంనగర్ బీజేపీ సీనియర్ నాయకులు పొలసాని సుగుణాకర్ రావు, గుజ్జుల రామకృష్ణ రెడ్డి (Gujjula Ramakrishna Reddy) అలిగారు. ఈ తరుణంలోనే.. గుజ్జుల రామకృష్ణ రెడ్డి ఇంట్లో వారితో సమావేశమైయ్యారు ఈటెల రాజేందర్. అయితే.. ఈ విషయం బండి సంజయ్ వర్గానికి తెలిసింది. అనంతరం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై బండి సంజయ్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలు సరిగ్గా జరగడం లేదని ఎన్నిసార్లు అధి ష్టానం పెద్దలకు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని నంబరు వరకు వేచి ఉండాలని.
అప్పటికి కూడా పార్టీ వైఖరిలో మార్పు రాకపోతే తాడోపేడో తేల్చుకోవాలని వారు నిర్ణయించినట్టు సమాచారం. సంజయ్ ఏకపక్ష నిర్ణయాలు ఒంటెత్తు పోకడల కారణంగా పార్టీ నష్టపోతోందని వారు అన్నాట్లు తెలుస్తుంది. పార్టీ రథసారథిగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ (BJP)కి ఒక ఊపు తీసుకొచ్చిన సంజయ్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే అధికార బిఆర్ ఎస్ (BRS)ఎన్ని ఎత్తుగడలు వేసినా సరే వాటిన్నిటినీ తిప్పికొట్టి ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటిన ఈటెల రాజేందర్ రాష్ట్ర కమలదళంలో జోష్ నింపారు. అటు హైకమాండ్ దగ్గర ఇటు జనాల్లో తమదైన స్టయిల్లో పేరు సంపాదించుకున్న ఈ ఇద్దరు నేతలు తాము సాధించిన గుర్తింపును నిలుపుకోవడంలో విఫలమవుతున్నారనే విశ్లేషణలు రాజకీయ విశ్లేషకులనుంచే కాదు.. సొంతపార్టీ నుంచే వెలువడుతున్నట్టు సమాచారం. ఈ ఇద్దరు నేతలూ బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) చేరిక వ్యవహారంలో నోరు జారి ఆ తర్వాత నాలుక్కర్చుకోవడం తాజాగా చర్చనీయాంశం