NRML: ప్రతి ఒక్కరు కాళోజి నారాయణరావు అడుగుజాడల్లో నడవాలని మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మంగళవారం కాళోజి 111వ జయంతిని పురస్కరించుకొని మున్సిపల్ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. కాళోజి నారాయణరావు స్వతంత్ర సమరయోధుడిగా, తెలంగాణ ఉద్యమకారుడుగా చేసిన సేవలను కొనియాడారు.