ADB: గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నార్నూర్ మండలం తడిహత్నూర్ గ్రామంలో దాల్, మిల్లెట్ ఫ్లోర్ మిల్ యూనిట్‌ను కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. సంపూర్ణ అభియాన్ 2.0లో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళల ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. ఇటువంటి యూనిట్ల వల్ల స్థానికంగా ఉపాధి పెరిగి మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతారని కలెక్టర్ ఆకాంక్షించారు.