మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవి పండితులు ఆచార్య కమలేకర్ దాగోజీరావు ఇవాళ ఉదయం కన్నుమూశారు. భగీరథ కాలనీలో ఉన్న ఆయన నివాసంలో పార్థివదేహాన్ని ఉంచినట్టు కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలియజేశారు. సాయంత్రం నాలుగు గంటలకు వీరన్నపేట పెద్ద శివాలయం స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుందన్నారు.