KNR: కరీంనగర్ పట్టణంలోని పద్మనగర్ మానేర్ స్కూల్లో మానేర్ విద్యా సంస్థల ఛైర్మన్ కడారి అనంతరెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఎస్టీఎఫ్ కరీంనగర్ అర్బన్ కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మానేరు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.